పరశురాముడు
మాధవమాసాన మాధవుండంతట
భార్గవ రాముడై ప్రభవమంది
జమదగ్ని సుతునిగా క్షాత్రతేజంబుతో
కార్తవీర్యునికున్న గర్వమడచె
వాక్కుతో వేదాలు వల్లించు నొకవైపు
ధనువుతో దుష్టుల దండనమ్ము
శరచాపసంధానచాతుర్యమైనను
శాపంబు పెట్టగ శక్తియుతడు
విష్ణువేరాముడై విప్రురూపంబుతో
గర్వాంధరాజులగర్వమడిచె
పరమేశుశిష్యుడై బడసెగా పలురీతి
శస్త్రాస్రములనెల్ల చక్కగాను
పరశువందెనుతానుపరమేశుచేతను
పరశురామాఖ్యతో పరిఢవిల్లె
"అగ్రతః చతురోవేదా*
*పృష్టతః సశరం ధను
*పృష్ఠతః సశరం ధనుః*
*ఇదం బ్రాహ్మమ్ ఇదం క్షాత్రం*
*శాపాదపి శరాదపి*
నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి పృష్ఠ భాగం లో (వీపు ) అమ్ములపొది ని ధరించి,
చేతిలో ధనుస్సు తో ఉన్న బ్రాహ్మణుడు అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు శరమూ ప్రయోగించగలడు.
ఆశీర్వాదమూ ఇవ్వగలడు అస్త్రమూ సంధించగలడు.
ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు.
సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్నాన్ని ,
క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి