పోస్ట్‌లు

విష్ణుసహస్రనామం భాష్యం

శ్రీ విష్ణుసహస్రనామం శంకర భాష్యం  నా ప్రయత్నం  వైశింపాయనొ జనమేజయం ఉవాచ 1 శ్లోకం "" కృత్వా ధర్మాన్ ‌అశేషణ పావనానిచ సర్వశః యుధీష్టిర శ్శాన్తనవం పునరేవ ఆభ్యభషతః" శంకర భాష్యం:-- సర్వాన్=అభ్యుదయ నిశ్రేయసోత్పత్తి హేతుభూతాన్ చోదనలక్షణాన్, అశేషేణ--,కార్త్వేస్య్ న్మ్య నః ప్రాకారైః శ్రుత్వాః యుధిష్టిరో -ధర్మపుత్రః శాన్తనవం -శంతన సుతం భీష్మం సకలపురుషార్థసాధనం సుఖసంపాద్య మల్పప్రయాసం మనల్పఫలం నుక్తమితి కృత్వా పునః భూయ యేవో అభ్యభాషత ప్రశ్నం కృతవాన్  భావం:-- ----------- యుధిష్ఠిరుడు అభ్యుదయము ,మోక్ష సాధనములు వేదవిహితములగు సకలధర్మములను, పాపక్షయకరమైన ధర్మం రహస్యములను భీష్మపితామహునివలన వినియూ,సకలపురుషార్థసాధనము, సులభసాధ్యము తక్కువ శ్రమతో అల్పమైన ఫలములగువిషయములకొరకు  మరలా ఈవిధంగా ప్రశ్నించెను [ ఆదిశంకరులు భగవద్గీత భాష్యపు అవతారికలో ప్రవృత్తి నివృత్తి రూపకములైన అభ్యుదయ నిఃశ్రేయసములను ప్రస్తావించడం గమనించ వచ్చు]

విగ్రహ విద్వేష విమత కుమతులార!

చిత్రం
విగ్రహ విద్వేష విమతకుమతులార! వినరండిమీరంత విస్తృతంగ నింగియేదైవంబు నీరధే దైవంబు సూర్యుణ్ణిదైవంగ చూడుగలము అనలమ్ముదేవుడే యనిలుడేదేవమై అంతటా నుండుట యరదుకాదు నగములేదైవాలు నదులెల్లదేవతల్ ధరణియే దైవంగ తలచుమెపుడు చంద్రుడేదైవంగా యింద్రున్ని యిష్టంగ మదిలోన భావించ మనసుగలదు ప్రకృతియే దైవంబు పరమాత్మ‌తత్త్వంబు అంతటనిండినయచ్యుతుండు అణువులోదేవుండునఖిలాంతరాత్ముడై అంతటానిండిన యాత్మమయడు తల్లియేదైవంబుతండ్రియేదేవుండు  ఆచార్యు పూజయె యర్హమోయి విశ్వాననున్నట్టి విశ్వాసరాత్ముడు విగ్రహరూపుమై వెలసినాడు  తరుణులే దేవతల్ తరువులెదైవంగ భావించి నామొయి భక్తికలిగి ఇందుకలడడండులేడను భావంబు పుట్టలేదుయింక పుట్టదెపుడు గుడులు కూల్చునట్టి కూళలకెప్పుడు మత్సరమ్మతప్ప మమతలేదు అసుర భావులార! యజ్ఞాన భావన్ని మానుకొన్నయపుడె మంచిదౌను (రచన:- విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

శిఖిపించమౌళి

చిత్రం
చిలిపి కృష్ణుడతడు శిఖిపించ మౌళియౌ ఆలమందలతోడనరుగు చుండు గోప బాలు డమ్మ గోవిందుదతడమ్మ మనకు రక్ష నొసగు మాధవుండు దేవుదేవుడతడు దేవకీ గర్భాన జననమందినతడు జగతికావ వేదవేద్యుడతడువేణుగానలహరి వినిపించి మురిపించె విశ్వ మయత గోవర్ధనోధ్ధారి గోపబాలురకూడి ఆలమందలతోడ యరిగి తిరిగె ఆ.వె.బాలకృష్ణు డతడు భక్తమానసహంస శిష్ట జనుల కెల్ల శ్రేయ మొసగ అవని వెలసి నట్టి యచ్యుతుండతడోయి ఇహము పరము లిచ్చు యూశ్వరుండు (విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కైలాసశైలం

చిత్రం
కైలాస శైలాన కనకాచలమటుల కనరండి కనరండి కన్నులారా! రమ్యమౌ శైలాన రజితాద్రి వాసుని చూచినవారివే చూపులోయి పార్వతీ నాథుని పరమేశు తిలకించు హృదయారవిందమే హృదయమయ్య నిగమైక వేద్యుని నిరతంబు నాత్మలో  దర్శించు జన్మమే ధన్య మోయి ఆ.వె. భక్త సులభు డతడు భవబంధ మోక్షమ్ము కలుగు జేయనతడు కరుణ తోడ అతని యాన లేకయాకైన కదలదు ఇహము పరములిచ్చు యిష్ట పడిన (రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

దుర్దిదినం

చిత్రం
మబ్బుతోడ నింగి మసకేసినదినము దుర్దిదినమెయంచు తోచ వచ్చు శివుని మనసనందు చింతపనిదినమె దుర్దినంబెయగును ద్రువముగాను

కొలనీ నీరు - కోరుకొన్న వాడు

చిత్రం
కొలని నీరుకాదె కోరినట్టివానిని కనులముందు నిలిపె కాంక్షతీర మదిని మెదలువాడె మగడౌను సుమ్మింక చిత్రమగును.కాదె చిత్రరీతి

వేణుగానలోలుడు

చిత్రం
&&&&భాగవత మకరందాలు&&&&& ఆంధ్రమహా భాగవతము తెలుగువారి నోములు పంట.అందులోని ప్రతిపద్యమూ,ఆనందామృతములోనుంచి ముంచి తీసిన యమృత ఫలము.పోతనామాత్యడు తనఘంటమును భక్తి సుధారసములో ముంచి రచించినట్లుగా ఈ పద్యము అలరారుతుంది. ఈ పద్యరత్నము ఆంధ్రమహాభాగవతములోని ద్వితీయస్కంధములో నున్న అనర్ఘ్యపద్యరత్నము. సీ||సాంద్రశరచ్చంద్ర చంద్రికా ధవలిత విమల బృందావన వీధియందు రాసకేళీ సముల్లాసుడై యుత్ఫల్ల జలజాక్షుడొకనిశాసమయమున దనరారుమంద్ర మాధ్యమం తారముల నింపుదళకొత్త రాగబేధముల దనరి దైవతం ఋషభ గాంధార నిషాద పంచమ షజ్జ మాధ్యమం స్వరములోలి తే.గీ.గళలుజాతులు మూర్చనల్ గలుగ వేణు నాళవివరాంగుళీ న్యాస లాలనమున మహితగతిబాడె నవ్యక్త మధురముగను పంకజాక్షుండుదారువులంకురింప పద్యభావము:--- శరదృతువులోని  పౌర్ణమి రాత్రి,చంద్రకిరణాలుబృందావనమునందు వెల్లివిరుస్తుండగా, అరవిందదళాక్షుడు మిక్కిలి ఉల్లాసముతో రాసకేళిని కావిస్తూ,తన సుకుమార సుందరహస్తములతో వేణువుపై గల రంద్రములను మూస్తూ,తెరుస్తూ,మంద్రమధ్యమ తారకములతో దైవతం,ఋషభ,గాంధార,నిషాద, పంచమషజ్జస్వరములతో ,కళ్లు,జాతులు,మూర్ఛనలు కలుగజేస్తూ అవ్యక్తమధురమ...