విగ్రహ విద్వేష విమత కుమతులార!

విగ్రహ విద్వేష విమతకుమతులార!
వినరండిమీరంత విస్తృతంగ
నింగియేదైవంబు నీరధే దైవంబు
సూర్యుణ్ణిదైవంగ చూడుగలము
అనలమ్ముదేవుడే యనిలుడేదేవమై
అంతటా నుండుట యరదుకాదు
నగములేదైవాలు నదులెల్లదేవతల్
ధరణియే దైవంగ తలచుమెపుడు
చంద్రుడేదైవంగా యింద్రున్ని యిష్టంగ
మదిలోన భావించ మనసుగలదు
ప్రకృతియే దైవంబు పరమాత్మ‌తత్త్వంబు
అంతటనిండినయచ్యుతుండు
అణువులోదేవుండునఖిలాంతరాత్ముడై
అంతటానిండిన యాత్మమయడు
తల్లియేదైవంబుతండ్రియేదేవుండు 
ఆచార్యు పూజయె యర్హమోయి
విశ్వాననున్నట్టి విశ్వాసరాత్ముడు
విగ్రహరూపుమై వెలసినాడు
 తరుణులే దేవతల్ తరువులెదైవంగ
భావించి నామొయి భక్తికలిగి
ఇందుకలడడండులేడను భావంబు
పుట్టలేదుయింక పుట్టదెపుడు
గుడులు కూల్చునట్టి కూళలకెప్పుడు
మత్సరమ్మతప్ప మమతలేదు
అసుర భావులార! యజ్ఞాన భావన్ని
మానుకొన్నయపుడె మంచిదౌను
(రచన:- విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత