తత్త్వచింత
1ఎవరు భార్యపుత్రుడెవరోయి
కాపురంబు చూడకలుగువింత
ఎవరు నీవు రాక యెటునుండి తెలియక
తత్త్వ మెరుగ తరమె ధోరణిలోనే
2బాల్యమేమొ నాటపాటలకరుగును
యువతి వలపు చిక్కె యవ్వనమ్ము
ముదిమి వయసులోన ముసురుకొనునుచింత
బ్రహ్మ ముందు మనసు పారదకట!
(ముక్తికోరనట్టి మూర్ఖ బుధ్ధి)
3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము
కుశలమడుగు తాను కూర్మి మీరు
ఊపిరాగగానె నుండును బంధమ్ము
మాయదారి జగతి మర్మమింతె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి