దేహాము- దహి
దేహాలు యెన్నైన దేహియొకడనుచు
తెలిసికొనుటంతతెలివి యౌను
అలలుయెన్నైనను నంభోధి యొకటంచు
సత్యమ్ము తెలియుటె సాధు వగును
సకలజీవలయందు సర్వాత్ము డుండగా
హింసించు తలపంత హీన మగును
కర్మాను బంధమే కారణంబనియంచు
వేదాలు శాస్త్రాలు వెల్లడించె
సమహిత్వంబొక్కటె సాధుత్వ మనునట్టి
పోతన్నమాటను పొల్లుపోకుండా
పాటించవలెనింక పట్టుదలగ
ఆ.వె.పూర్వకర్మ చేత పుణ్యంబు పాపంబు
అనుభవించ వలయు యయ్యలార!
జీవహింస లేని జీవనమ్మెమనకు
లక్ష్య మైన చాలు లక్ష లేల!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి