ఆటవెలదులు
చిలిపి కృష్ణు డమ్మ శిఖిపించ మౌళితో
ఆలమందతోన నరుగు చుండు
గోప బాలు డమ్మ గోవిందుదతడమ్మ
మనకు రక్ష నొసగు మాధవుండు
ఎట్టిస్థితినియైన యేమరకుండగా
మిత్రరక్షణమ్ము మీరడతడు
తనకుకష్టమనచుతలచుకుండునతడె
నీకుమిత్రుడతడె నిజము సుమ్ము!
తాడిదంతు ననుచు తలచకెపుడునీవు
నిన్ను దన్ను వాడు నిలను నుండు
వావి యున్నదనుచు వాగవలదునీవు
నోటి దురద వలన తీట దీరు
పైక మిచ్చి మనము బర్రెను కొనినట్లు
కట్న మిచ్చి మగని కొనగ వచ్చు
స్వంత వస్తు వన్న స్వాతంత్య్రమున్నట్లు
మగనిపైని హక్కు మగవకుండు
వెర్రికుదిరెనింక వేవేగ రోకలి
తలకు చుట్టు డనుచు తలచుకుంక
మతముపేరుతోడ మారణ హోమంబు
సల్పుచుండు నెపుడు సమయమెరిగి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి