నీచాశ్రయము
నీచునాశ్రయింప నేమి ఫలము దక్కు
ఆశ్రయింపవలయు నధికునెపుడు
వామదేవు చెంత వాసుకి గరుడుని
కుశలమడగె కాదె కూర్మి మీర
నీచాశ్రయో నకర్తవ్యం
కర్తవ్యో మహదాశ్రయః
ఈశశ్రాయో మహానాగః
ప్రప్రపశ్చ గరుడస్సుఖం"
*శ్లోకం*
నీచాశ్రయో న ఖలు కర్తవ్యః
కర్తవ్యో మహదాశ్రయః|
పయోపి శౌండకీహస్తే
వారుణీత్యభిధీయతే||
(సుభాషితరత్నావళి)
*తాత్పర్యం*
"నీచుల ఆశ్రయం, సహవాసం ఎప్పుడూ చేయకూడదు. మహదాశ్రయం అంటే మహానుభావుల ఆశ్రయం సాంగత్యం ఎల్లప్పుడూ కర్తవ్యం గా జీవించాలి. మద్యం విక్రయంచే ఆమె వద్ద పాలు వున్నా మద్యం గానే భావిస్తారు అలాగే నీచుల ఆశ్రయం లో ఎంత నిష్ఠగా వున్నా నీచునిగానే పరిగణిస్తారు.".
ఆశ్రయించుమోయి నధికునెపుడునీవు
నీచునాశ్రయించ నీచ ముద్ర
కల్లునమ్మువనితకరమునందు
పాల నైన జనులు కల్లు యనరె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి