శుధ్ధ భక్తి
ఇహము పరము లన్ని ఈశ్వరాధీనమ్ము
ఇంతకన్నభావమిలనులేదు
మంచితనముచూపి మాధవు పోందుటే
మనుజ ధర్మమిదియె మరువ కయ్య
శుధ్ధ భక్తి తోడ సుందర మూర్తిని
ధ్యాన మాచరించ దక్కునీకు
వేరు చింత మాని వేడుకొన్ననతడు
దరిని చేర్చు నిన్ను తప్ప కుండ
విభవమందు కాని విపదలోనైనను
మంచివారు యేక మార్గ గతులు
ఎరుపు రంగులోన నరుణోదయమునందు
అస్తమించు వేళ నర్కుడెరుపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి