గగన కుసుమాలు
గగనకుసుమమాలగళమున శోభిల్ల
చిరునవ్వుచిందించు చిద్విలాసి
ఎండమావి జలము యేరులై పారించి
వ్యవసాయమొనరించు వ్యక్తియితడు
కుందేటి కొమ్ముతో కువలయమ్మంతయు
కూర్మితో పాలించు ధార్మికుండు
గార్ధభాండమ్ముతో గమ్మత్తు చేయగా
మనవద్దకొచ్చిన మాంత్రికుండు
ఒప్పుతప్పులన్ని ఓర్మితో కలిపేసి
తప్పులెన్ను టందు తత్పరుండు
వంధ్యపుత్రుడన్న వాత్సల్యభావంబు
మనకు దక్కెననచు మరువదగునె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి