చరవాణి
చేతిలో చరవాణి చేష్టితమనుచూడ
నరులబ్రతుకులింక నవ్వులాటె
ఆబాల గోపాల మనుమాటలేదింక
తలలన్నిదూరును దానియందె
ఎదుటయెవరునుట యెరుకలేదింకను
మతిమాలి నట్టున్న మరుపుదప్ప
ముప్పుముసురుకొన్న ముఖమేమొతిప్పడు
పరులయాపదనంత పర్వంబు వలెనట్లు
సెల్ఫీల గొడవతో చేటు తెచ్చు
ఆ.వే.తనకు తెలియ నట్టి తాదాత్మ్య భావమ్ము
అంటు రోగ మట్టు నంటుకొనియె
మందు లేని యట్టి మాయరోగమిదియె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి