శ్వేతశ్వరోపనిషత్తు
శ్లో𝕝𝕝 ఏకో దేవ: సర్వభూతేషు గూఢ:
సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా
కర్మాధ్యక్ష: సర్వభూతాధివాస:
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ!!!!!
*(శ్వేతాశ్వతర ఉపనిషద్/౭/౨)*
తా𝕝𝕝 *అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడొక్కడే.... అతడే సర్వవ్యాపి.... సమస్త ప్రాణులకు అంతరాత్మ. సమస్తకర్మలకు ఫలప్రదాత.... సమస్త ప్రాణులకు అంతర్యామి... అన్నికర్మలకు సాక్షి*. జ్ఞాన స్వరూపుడు.... సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు.... అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు.... అతని కంటే ఇతరుడు మరొకడులేడు
అన్నిచోట్లనుండునఖిలాంతరాత్ముడు
అన్ని జీవులందు నణగియుండు
అన్నికార్యములకునతడెయధ్యుక్షుండు
నిఖిలజీవులందునిలిచియుండు
సాక్షిమాత్రుడతడు జ్ఞానస్వరూపుండు
గుణములేమిలేని గురుతువాడు
అతనికున్న ఘనుడు నతిని కన్న పరుడు
ఏమి లేని యిట్టి యెరుక యగును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి