శ్రీమాత దయచేత సిధ్దించు
శ్రీమాత దయచేత సిధ్ధించు సర్వంబు
చింతవీడువలెను చిట్టి తండ్రి!,
,విద్యయూ వినయము విత్తంబు నీకిచ్చి
మాన్యుగాచేయును మాతృకరుణ
చదవించు తల్లియేశారదా మాతయై
జ్ఞానబిక్షనొసగి జ్ఞాని జేయు
సర్వసంపదలోసగి సామ్రాట్టుగాజేయు
అంబదయకింక యంతు గలదె
మాయతెరనుద్రుంచి మోక్షంబు నొసగును
లలితాంబకలిగించు లక్ష్య సిధ్ధి
ఆ.వే.
కృపను చూపమంచుహృదయపూర్వంకంబు
వేడవలయు మోయి వేన వేలు
ఇంత కన్న నీకు యెవరయ్య మనవారు
అభయ మొసగు నట్టి యమ్మ కన్న
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి