సుముఖాయనమః

సుముఖుడ నుచునిన్ను స్తుతియింతు మనసార
ఏకదంతా నాకు నెరుక నిమ్ము
కపిలుడనగ పిల్వ కరుణతో.మమ్మంత
కావగలవునీవు ఖచ్చితంబు
గజకర్ణ నామంబు కర్ణంబు.సోకగా
కరిగిపో వుదువంచు ఖ్యాతిగలదు
లోకంబు నుదరాన సౌఖ్యంబు గాదాచ
లంబోదరాఖ్యకు లక్ష్యమీవ
వికటాఖ్యుడనుచు విశ్వంబు నిన్నెంతొ
ప్రార్దింతురధికమౌ భక్తియుక్తి
విఘ్నాలు కలిగింప విఘ్నాలు తొలగింప
విఘ్నరాజువు నీవు విశ్వమందు
దుష్టదనుజవర్గ ధూమకేతువునీవు
శిష్టరక్షణచేయ యిష్ట మయ్య
సురగణాధ్యక్షుండు సురలోక వంద్యండు
వరసిధ్ధి ప్రదుడుగా వన్నెకెక్కె
ఫాలచంద్ర ధరుని పసిపాపవయ్యను
పాలచంద్రుండ్రవై యేల గలవు
ఆరంభ విఘ్నాలు హేరంభుదయచేత
గాలచే దవ్వుల తూల బడగ
స్కందాగ్రు దయచేత సర్వంబు సమకూరు
నిస్సంశ యంబుగా నీకు నింక
 కవులలోన గొప్ప గణపతికవియంచు
నిగమ సారమంత నిగ్గు దేల్చె
జ్యేష్ట రాజు వనుచు శ్రేష్టంబుగానిన్ను
ప్రార్థనంబు చేతు పరమ భక్తి
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత