బ్రహ్మవిద్య

బ్రహ్మ విదుడెపుడు బ్రహ్మమ్మె తానౌను
శంకింప పనిలేని సత్యమిదియె
సత్యంబు జ్ఞానంబు సబ్రహ్మరూపాలు
నిగమాలు తెల్పిన నిజము కనుము
ఆదియు నంతంబు నసలేమి లేనట్టి
బ్రహ్మాను భూతియె పరమ పదము
బుధ్ధికుహరమందు పూర్ణమౌ బ్రహ్మామున్
దర్శించు జన్మంబు ధన్యమోయి
ప్రభవించె సర్వమ్ము పరమాత్మ నుండియె
ఆకాశముననుండీ యనిల మొదవె
అనిలంబునుండియెయనలమ్ములభ్యము
జ్వలనమ్ము నుండియె జలము కలిగె
జలమువలనకాదె జనియించె పృధివంత
ఉర్వినుంచివెడలె యోషుధులెల్లును
ఓషధులవలనె యోగిరమ్ము
భుక్తివలనకాదె పురుషుడు బ్రతుకును
ఆ.వె.
బ్రహ్మ విద్యనెరగ బ్రహ్మమేతానౌను
నిగమశిఖలతెల్పునిజయము కనుము
గురువు వలన కాదె గుప్తమౌ విద్యచే
పొంద వలయు మనము పూర్తిగాను
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
(తైత్తిరీయోపనిషత్తు  నుండీ స్వేఛ్ఛాను‌వాదము)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత