దశరథ పుత్రుడు -ధర్మస్వరూపుడు

దశరథ పుత్రుండు ధర్మస్వరూపుడై
దాక్షిణ్యమూర్తియై ధరను వెలసె
కౌశల్యపుత్రుడై కోమలగాత్రుడై
కారుణ్య మూర్తిగా ఘనతకఎక్కె
సౌమిత్రికన్నయై సౌభాతృభావమ్ము
ఇదియంచుతెలుపగా యిలకు దిగియె
సీతమ్మ భర్తయై చిరకీర్తియుక్తుడై
కళ్యాణరాముడై కరుణజూపె
సత్య వాక్యరతడు సర్వభఊతహఇతఉడఉ
మునులహృదయమందు మసలువాడు
కామితార్థమొసగు కైవల్యమూర్తియై
ఒంటిమిట్టవెలసె వోర్పు మెరిసి
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత