జీవన్మృతులు కీర్తిశేషులు
*శ్లోకం*
జీవతి యశో యస్య
కీర్తిర్యస్య స జీవతి|
అయశోఽకీర్తి సంయుక్తో
జీవన్నపి మృతోపమః||
(సుభాషితరత్నావళి)
*తాత్పర్యం*
యశస్సును కీర్తిని గలవాడు జీవించినవాడగును.అయశస్సు ,అకీర్తితో కూడిన వాడు జీవించియున్నను మరణించిన వానితో సమానము.యశస్సు అనగా పరాక్రమధైర్యసాహసముల వలన కలిగేది.కీర్తి అనగా దానధర్మాదుల వలన కలిగేది.
మాననీయుడితడుబహుమంచివాడంచు
పేరుపొందుబ్రతుకె పెద్ద బ్రతుకు
చెనటివాడువీడు చెడ్డవాడనియంచు
బ్రతికినట్టి బ్రతుకె బండ బ్రతుకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి