చదువులమ్మ శారదమ్మ

చదువులమ్మమనల చల్లగా చూడగా
నిగమాగమాదులు నీకుదక్కు 
అంబకరుణలేని యఖిలలోకంబంత
మూగచెవిటి వాని ముచ్చ టగును
వాగీశ్వరీదేవి వరమీయ దలచగా
పామరుండవనింకపండి తుండు
శ్రధ్ధతోమేధతో శాస్త్ర మల్ గ్రహియించ
ధారణ బలముతో ధార్డ్య మగును
ఆ.వే.వేద విద్యలన్ని వేద్యంబు లగునట్లు
శ్రధ్ధ నొసగ వమ్మ శారదాంబ
నీవె కావ వలయు నిరతంబు మమ్మెల్ల 
ప్రార్థ నంబు జేతు భక్తి మీర
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత