ప్రపంచ పుస్తక దినోత్సవం

గ్రంధ పఠన చేయ కలుగువిజ్ఞానమ్ము
లోకరీతి తెలియు లోతుగాను
కలిమి కన్న బుధ్ధి ఘనమకాదెమనకు
పుస్తకంబు మనకు నేస్త మయ్య

పుస్తకంబు వాని హస్తభూషణమాయె
భావమెరుగులేక భారమాయె
గార్ధ బంబు మోయి గంధపు తరుశాఖి
దానితావి యెరుగ దాని వశమె వశమె

జ్ఞాననిధులు కావె గంధ్రాలయములింక
విద్య నొసగి నిన్ను విభుధుచేయ
పుస్తకంబు కోరు మస్తకమునెపుడు
అక్ష రమ్మె జగతి కిక్షు రసము
(పుస్తకం పఠనం దినోత్సవం)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత