సుభాషితం
అప్రగల్భస్య యా విద్యా
క్రుపణస్య చ యద్ధనం ।
యఛ్ఛబాహుబలంభీరోః
వ్యర్థమేతత్త్రయం భువి ।।
ప్రజ్ఞా పాటవాలు లేని వాని యొక్క చదువు , పరమ లోభి యొక్క ధనము , పిరికి వాని యొక్క భుజ బలము ఈ మూడున్నూ ఈ భూమియందు ఎందుకూ కొరగానివి, వ్యర్ధము నిరుపయోగము అయనవి
ప్రజ్ఞ లేనివాని పాండితీ విభవమ్ము
పిసిని గొట్టువాని పైకమంత
పందకున్న యట్టి బాహుబలముకూడ
లోకమందు కూడ లోకవగును
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి