వనమాలి

వనమాల ధరియించి వయ్యార మొలికించి
భక్తాళి నీవెంట పరుగువెట్ట
ఆవంక భూలక్ష్మి ఈవంక శ్రీలక్ష్మి
హృదయాన నిలిపావు హృద్యమగును
చక్రంబు చేపట్టి శంఖంబు పూరించి
దనుజమర్దనచేసి డస్సినావు
ఫణీరాజు పడకగా పవ్వళించితివీవు
అరమొడ్పు కనులతో అందమొలుక
వైన తేయి నెక్కి వైళంబు పయనించి
భక్త జనుల నెల్ల బ్రోచినావు
నిన్నునమ్మి నాను నిరతంబు నీదయ
కురియజేయ వయ్య కూర్మి మీర
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత