భజగోవింద శ్లోకాల భావానువాదము

1భార్యపుత్రులనెడిభావమ్ము చూడగా
చిత్రమగునె కాదె సృష్టిలోన
ఎవరు తానొతనకెయెరుక లేదు
తత్త్వ మెరుగ తరమె తనకు నింక

మరలమరలపుట్టి మరలగిట్టితిరిగి
జననిగర్భమందు జన్మమెత్తు
సారహీనమైన సంసార జిలధిలో
ముణగనీకుమయ్య భుజగశయన

2.బాల్యమేమొయాటపాటలకరగును
యువతి వలపు చిక్కె యవ్వనమ్ము
పండువయసులోనపలుచింతలాయగా
బ్రహ్మ ముందు మనసు పారదకట!

3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము
కుశలమడుగు తాను కూర్మి మీర
ఊపిరాగగానె యుండదు బంధమ్ము
మాయదారి జగతి మర్మమింతె

(ఆది శంకరుల భజగోవిందం శ్లోక భావాను వాదము) --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత