సూక్తి సుధ2

.   
                  _*సుభాషితమ్*_

 𝕝𝕝శ్లోకం𝕝𝕝

*వరమసిధారా, తరుతల వాసో*
*వరమిహ భిక్షా,వరముపవాసః*
*వరమపి ఘోరే నరకే పతనం*
*న చ ధన గర్విత బాంధవ శరణమ్*

తా॥
ధనగర్వంతో మిడిసిపడే బంధువులను ఆశ్రయించటం కంటే?, కత్తి అంచు మీద నడవటం, చెట్టు నీడలో నివసించటం, బిచ్చమెత్తుకోవటం, నిరాహారియై ఉండటం , చివరకు నరకంలో పడటమైనా శ్రేష్ఠం.

కాసుకలిగినట్ఝి గర్వాంధబంధుల
చెంతచేరుటన్నచేటుకలదె
కత్తిమీదసాముకన్ననుకష్టంబు
ఇంతకన్నబాధ యిలనులేదు
తరువునీడలోనతలదాచుకోవచ్చు
బిచ్చిమెచ్చిప్రొద్దు బుచ్చవచ్చు
అశనమేమిలేక యలమటించగవచ్చు
నష్టమేమిలేదు నరకమైన
(తెనిగింపు --విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత