వంశకీర్తి

𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే,|
స జాతో యేన జాతేన యాతి వంశస్సమున్నతమ్||

*--- _భర్తృహరి సుభాషితము_ ---*

తా𝕝𝕝 చావు పుట్టుక లనునవి యెప్పుడునుగల ఈ సంసారచక్రమున జన్మించిన వారందరును పుట్టువారే.... అట్లు పుట్టినవారిలో నశింపని వారెవరు? *ఎవని పుట్టుక వలన వంశము కీర్తినొందునో వాడే జన్మించిన వాడు..... 
వాని జన్మయే గణనీయము*.

జనన మరణశీల జగతిలోనందరు
పుట్టి గిట్టివారె పుడమిలోన
వంశకీర్తియంత వాసికెక్కగలదొ
అట్టివాడు కాడు గిట్టువాడు..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత