సుభాషితం

కోరలసలులేని కోడెనాగమటుల
మదమములేనియట్టి మదగజమ్ము
ధనములేనియట్టినరుడుజగతిలో
నామ మాత్రుడైన మానవుండు

శ్లో𝕝𝕝 దంష్ట్రా విరహితః సర్పో
మదహాహీనో యథా గజః।
తథాఽర్థేన విహీనోఽత్ర
పురుషో నామధారకః॥

*--- _అర్థసఙ్గ్రహః_ ---*

తా𝕝𝕝 *ఈ ప్రపంచంలో* కోరలు విరిగిన పాము, మదం పోయిన ఏనుగు, ఎలా నామమాత్రానికే అగునో, అలాగే *ధనం పోగొట్టుకున్న పురుషుడూ నామమాత్రానికే అగును*.!!
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత