కాల భైరవుడు
కాలాభ్రదేహుండు కారుణ్య మూర్తియై
వరవృష్టి కురిపించారు వరుసగాను
భయకంపితమగు భైరవరూపంబున
దుష్టాత్ము లందరి దునుము నితడు
అఘములెల్లను నపహరించునతడు
శివదర్శనోత్సక శివభక్తు తతికంత
ఆమర్దకస్వామియే యనుమతించ
భక్తసంఘపునఘ భక్షణక్షమతచేత
పాపభక్షఖ్యాఖ్య పావనుండు
ఆ.వే.విశ్వనాథు కన్న వినయశీలమొసగ
కాలభైరు వుణ్ణి కనుము తొలుత
అతని యాజ్గచేత నన్నియూ సమకూరు
కామితార్థమంత కలుగు నీకు
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ
శాస్త్రి
)అన్నపూర్ణతల్లి యన్నంబు పెట్టగా
విశ్వ మర్మమెల్ల విశద పడును
పెద్ద కనుల తల్లి ప్రేమతో చూడగా
కాశివాసఫలము కలుగునీకు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి