అగ్ని లింగమూ-అరుణాచలము

సకలసృష్టినెల్ల సాగించు ఘనుడంచు
నలువ తనదు ఘనత తెలుపసాగె
విశ్వరక్ష సేయ విష్ణువే యధికుండు
అనుచుతెల్పసాగె నత్యుతుండు

అహమహమికయిట్లుయర్రులుచాచగా
సమరమట్లుసాగె చాలా ప్రొద్దు
విశ్వమంతయిట్లు విలయమందునపుడు
జగడమంతయునాప సాంబశివుడు

అగ్నిలింగమట్లుయరుణాచలమున
ఉధ్భవించినాడు నుర్విపైన
మొదులుచివరలెల్లమొనగాడె కన్పెట్టు
వాడుగొప్యయగుట వాస్తవంబు

ఆది జూతుననుచు నార్భాటముల్ జేసి
పయనమైతినేను భ్రమల మునిగి
వెదికి వెదికి నేను వేసారి పోతిని
అంతమేదొనాకు యందలేదు

బ్రహ్మండ వ్యాప్తమౌ భవ్యమౌలింగమ్ము
ఆగ్రంబుచూడకయలసినాడు
జగడాన జయమందు సాక్ష్యంబు కొరకునై
వెదుకంగ దలచెను వింతగాను
ఉడువీధిపైనుంచినుగ్రంపువేగాన
కేతకీపుష్పంబు క్రిండబడుట
వీక్షించితానంత వెరుగ బడియె
అద్యంతమేదంచునాశతో నడగగా
గురుతేమిలేదంచు గునిసె పూవు
కామధేనువుతాను కానననచుపల్కె
పందెమ్ము గెలువగా పన్నిదమ్ము
సాక్ష్యంబు పల్కగా సమ్మతించమనుచు
బ్రతిమాలెసాగెను బ్రహ్మయంత
శాపంబు భయముతో సమ్మితించవలసె
అవునంచునూపెనునాననంబంతయు
కాదంచుతోకను కదిపెనపుడు
కేతకీపుష్పాన్నికేదారపూజకు
అర్హంబుకాదంచు నాజ్ఞ సేసె
పృష్టంబు పూజ్యంబుపృథివిలోజనులకు
మోసంబుచేసిన మోముకాదు
అనుచుధేనువకంత యాజ్ఞయొసెగె
కిటిరూపమొత్తినకేశవుడంతశోధించి
అంతంబుకానకనభువుచేరి
అంతంబులేదయ్యనంబికానాధుడా
నిక్కంపునిజమంచు నిగ్గతేల్చె
త్రైలోక్యపూజ్యుండుత్రైలోక వంద్యుండు
నీరజాక్షుడెపుడునీతిశాలి
మాధువుండెప్పుడు మావాడుమాతోడు
ఆలింగనమొనరించెహరినిహరుడు
లింగోధ్భకథనంతలింగోద్భవంబున
ఆలకించినచాలునభవుడిచ్చు
మోక్షంబునొసగునుమోదమంది.
(రచన -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
[ఇంత నిడివి యైన కవిత రాయడం ఇదే  ప్రారంభం   , రసజ్ఞత కలిగిన వారు ఒప్పులుంటే  శివుని ,తప్పులేమో నావి అని గ్రహించగలరు]

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత