సీతమ్మ తల్లి రామయ్య తండ్రి

సిగ్గుల మొగ్గయౌ సీతమ్మ తల్లియె
కళ్యాణ శోభతో కదలివచ్చె
అందాలు చిందించు నయోధ్య రామయ్య
దరహాస వదనుడై తరలివచ్చె(రాగ)
ఆకాశమాయెగా హరివిల్లు పందిరి
పుడమియం తయుమారె  విడిది యిల్లు
దశరథుండంతట నగుమోము చిందించు
పున్నెంపు.మొలకయౌ పుత్రుజూచి
కౌసల్య మాతయె కళ్యాణ తిలకంబు
తీరుగా నుదుటను తీర్చి దిద్దె
రాములోరి పెళ్ళి రారండి మీరంత
కనుల పండువగును కాంచినంత
జన్మధన్యమగును జన్మంబు లేదింక
మాట యిచ్చినాము మరువ కండి
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత