భధ్రాచలం రామచంద్రుడు
భక్త రామదాసు భద్రాద్రి రాముని
భక్తితో సేవించె ముక్తికోరి
అందమౌరీతిగాయతిభక్తిరాముని
కోవలె నిర్మించి కొలువ దీర్చె
సీతమ్మ కతడంత చింతాకు పతకాన్ని
చేయించెతానంత చిత్రరీతి
సౌమిత్రికతిభక్తి చేయించే తానెంత
ముత్యాల హారాన్ని ముద్దుగాను
కలికితురాయితో కళ్యాణ రాముడు
మురిపాల మోముతో ముద్దులొలికె
పచ్చలపతకాన్ని పరమాత్మ కర్పించి
చరితార్థమొనరించె జన్మనంత
కీర్తనభక్తితో కీర్తించె రాముని
దశరథు పుత్రుని దయనువేడి
రచియించె శతకమ్ము రమ్యమౌశైలితొ
ప్రతియక్షరమ్మంత పానకమ్మె
కఠినమౌశిక్షగా కారలోనతడంత
బాధలనన్నింటిభరియించెభక్తితో
పూర్వభవపు కర్మ పూర్తిగాముగియగా
రాముడె వచ్చెను రక్ష సేసె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి