చిత్తూరు నాగయ్య

నటుల లోన మేటి నటుడతడు చూడ
త్యాగ గరిమలోన త్యాగరాజె
రామ భక్తిలోన రామదాసుదతడు
పోత పోసి నట్టి పోతరాజు

చిత్ర సీమ లోన చిత్తూరు నాగయ్య
మేలిముత్యమంటి మేటి నటుడు
అతనికెవరుసాటి అభినయమందున
త్యాగరాజు పేరు తగును కాదె
(రచన: విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత