ఋణశేషం
శ్లో𝕝𝕝 ఋణశేషోగ్ని శేషశ్చ
శత్రుశేషస్తథైవచ!
పునః పునః ప్రవర్ధంతే
తస్మాచ్ఛేషం న రక్షయేత్!!
తా𝕝𝕝 *ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం మరల మరల ప్రవృద్ధమౌతాయి... అందువల్ల ఆమూడింటినీ మిగుల్చు కోరాదు అని ఈ శ్లోకానికి అర్థం*....
మిగిలియుండరాదు మితముగానైనను
అప్పునిప్పులెపుడు నరులుకూడ
పెరిగిపెద్దవైన పెనువిపత్తుగమారి
కష్టపెట్టగలవు కడకు నిన్ను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి