అర్ధనారీశ్వర తత్త్వము

అర్ధనారీశ్వరులపరూప చిత్రమ్ము
అసదృశమైనట్టి యధ్భుతమ్ము
జగతిలో నీరీతి చాతుర్య రచనమ్ము
కన్పట్టు మనకంత కావ్యమందు
కాళిదాసుమదిని కాంచినాడేమోను
భావించి నేమోను భాగ్యమట్లు
ఆధ్యాత్మ తత్త్వమే యాధార భూతమై
సాగించినట్టిదౌ శాస్త్ర మిదియె
నందీశు పైచేయి నగజాత కలశమ్ము
అర్ధనారీశ్వర యద్వైత తత్త్వంబు
కన్నుల ముందర కాంచ గలము
వాగర్ధ ములరీతి వాత్సల్య భావమ్ము
అమ్మనాన్నలయట్లు నందమొసగు
ఆ.వె.అమ్మనాన్నలట్లు నాప్యాయమందించు
సాంబశివునిచేరి శరుణుకోర
అర్థమగుదురోయి నర్ధనారీశ్వర
తత్త్వమంతయింక తప్పకుండా
(రచన:- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత