దత్తాత్రేయాయనమః

అనసూయాత్రిసుతుడానందమయడు
 దత్తుడైవచ్చిన ధర్మమూర్తి
ఉన్మత్తవేషాన నుగ్రమ్ముచూపించి
బాలుడై విచ్చెసి భయముబాపు
పైశాచివేషాన పీడించి బాధించి
కారుణ్యమూర్తియై కాచుమనల
త్రైగుణ్యమూర్తియై తిరుగాడువానికి
విధియేమి వలదేమి వింతగాను
యోగివైయొకమారుభోగివైయొకమారు
యేరూపమోకేమియెరుక
ధ్యానంబు ధ్యేయంబుధ్యాతగాతానున్న
మూర్తిత్రయాత్ముడౌవిశ్వ మూర్తి
ఆదిలోనజుడండు హరియేమిమధ్యలో
అంత్యాన శివుడుండునతనిలోన
కాశికాక్షేత్రాన కావించు స్నానమ్ము
కొల్హాపురమున కౌరు జపము
మాహురీపురమందుమాధుకరాన్నము
సహ్యాద్రశయనమ్ము జరుపునెపుడు
దిగ్వస్త్ర ధారియై దీపించు తేజమై
భస్మానులిప్తుడౌ  భవ్యమూర్తి
ధర్మమే ధేనువై దత్తునాశ్రయమంది
ధాత్రిజనులకెల్ల దారిచూపు
(రచన :-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత