నా నటరత్నాలు
ఈ రోజు అంతర్జాతీయ నాటక దినోత్సవమట! -------
ఆ సందర్భంగా మావిద్యార్థుల గురించి కొన్ని ముచ్చట్లు.
"నాటకాంతంహి సాహిత్యం"అని ఆర్యోక్తి.
సాహిత్యం మేలిమలుపే నాటకం అని పిండితార్థము
1982లగాయతూనవభారత ఉన్నతపాఠశాలలో నా ఆంధ్రోపాధ్యాయవృత్తిలో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులచే నాటికేలియంచడం ఒక సంప్రదాయంగా వచ్చింది. ఒకసారి అదృష్టవశాత్తు కవికులతిలకుడైన కాళిదాస విరచిత అభిజ్ఞాన శాకుంతలం చతుర్థాంకము విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది.అందుకు ఆంగ్లమాధ్యంలోఉపాధ్యాయులైన శ్రీమతి సుబ్బలక్ష్మి శ్రీ సుబ్రహ్మణ్యులు గొప్ప సహకారం అందించారు.
అటుతరువాత కొత్తగూడెంలోజరిగేబాలోత్సవంలో రాష్ట్రస్థాయి నాటిక పోటీలలో2000 మా విద్యార్థులు నాదర్శకత్వంలోపాల్గోవడం జరిగింది.ప్రతినాటిక విజయవంతమైంది.
రెండు మార్లు ఉత్తమ నాటికరచనకు రెండుమార్లు ఉత్తమ దర్శకత్వం అవార్డులు లభించాయి.నాకు లభించిన విజయాల వెనుక సృజనశీలురైన నా విద్యార్థి బృందము యొక్క ప్రతిభా పాటవాలు ముఖ్యకారణం.
మాములుగా వక్తృత్వ పోటీలంటే అంత అభిరుచి ఆసక్తి చూపని బాలలు నాటికలంటే మునుముందుకు వచ్చేవారు.కారణమేమంటే వారి చేతికి ఊతకర్రలాంటి సంభాషణలు వుంటాయి.ఆంగీకం,వాచికం, ఆహార్యాలుతో సభాపిరికితనం పారిపోయేది.చక్కని సంఘం స్పూర్తి (టీంస్పిరిట్ ) వుండేది. దానివల్ల వారిలో భావవినిమయ సామర్థ్యం (communication skill) పెరిగేది.సహనటులు తమసంభాషణ మరచిపోతే ఆలోటు కనిపించకుండా తోటి విద్యార్థులు పూరించే వారు.ఇది వారి భావి జీవితంలో సాప్ట్ వేర్ ఉద్యోగాల్లో గానీ,మిగిలిన వృత్తుల్లో కానీ విజయంవంతమవడానికి సహకరించిందని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి