ధనసంపాదన

శ్లో|| ధనం తావదసులభం లుబ్ధం కృచ్ఛ్రేణ రక్ష్యతే।
లబ్ధానాశో తథా మృత్యుః తస్మాదేతన్న చిన్తయేత్॥

తా|| "ధనసంపాదన చాలా కష్టము. సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టము. లభించిన ధనము పోనూవచ్చు. లేదా తానే మృతినొందవచ్చు. కావునా *ధనముగూర్చి అంతగా వ్యసనపడుట మంచిది కాదు*."

అర్థమార్జనంబునధికకష్టతరము
తస్కరించబడక ధనమునంత
మదుపుచేయనతడు మరణించనూవచ్చు
మధనపడకనుండ మంచిదగును
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత