ధనమూలమిదం జగత్
శ్లో𝕝𝕝 వయోవృద్ధాస్తపోవృద్ధాః
జ్ఞానవృద్ధా బహుశ్రుతాః।
ఇత్యేతే ధనవృద్ధస్య
ద్వారే తిష్ఠన్తి కిఙ్కరాః॥
*--- సూక్తిసుధానిధిః ---*
తా𝕝𝕝 *వయస్సుచేత* వృద్ధులూ, *తపస్సుచేత* వృద్ధులు, బాగా *చదువు కొని జ్ఞానంచేత వృద్ధులైనవారు*, ఇలాంటి వారందరూ కూడ *ధనంచేత వృద్ధుడైన వాని ద్వారం దగ్గర కింకరులై పడి ఉంటారు*....
వృద్ధులైన నేమి వృధ్ధతపుసులైన
జ్ఞానవృధ్ధులైన ఘనతలేదు
విత్త వృద్ధులున్న వీధిగుమ్ముమునొద్ద
వేచియుందురకట వివశచేత
(తెనిగింపు -విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి