శివ ప్రదోష స్తోత్రము
శివ ప్రదోష స్తోత్రము
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం|
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే।।
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ।
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే।।
వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖోవేణుందధత్పద్మజః।
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా।।
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా।
సేవంతే తమనుప్రదోష సమయేదేవంమృడానీపతిమ్।।
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య।
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ।।
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః।
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః।।
ఇతి శ్రీ శివ ప్రదోష స్తోత్రం
సంపూర్ణం.
కైలాసశైలానకమనయభవనాన
రమ్యంబుగూర్చెడి రత్నపీఠి
ముల్లోకములతల్లిమురియుచుండ
ఆనందతాండవమాడెశివుడు
సకలదేవతలెల్లసంభ్రమానందాన
భక్తితోవారంత భజనసేయ
వాగ్దేవి కఛ్ఛపివాదంబుగావించె
శతమఖుడంతటశ్రావ్యమౌరీతిగా
మ్రోయించెవేణువు మంద్రగతిని
తాళంబుసమకూర్చెధాతయింక
మాధుర్యగీతమ్ము మారమాదేవియె
ఆలపించెనుకాదెనమృతమట్లు
మార్ధవంబొసగమాధవుడంతట
మద్దెలను మ్రోయించి మధురఫణితి
సకలదేవతలెల్లసంభ్రమానందమందుంచు
అనిమిషభాగ్యంబునందినారు
మునిమాపువేళలోముక్కంటి పార్శ్వాన
ముల్లోకములవారుమోదమంద
తిలకించిపులకించెదిక్కులన్ని
(బాల్యంలో అమ్మ నేర్పించిన శ్లోకానికి భావాను వాదము)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి