అడవి జంతువుల ఆవేదన

మాటల్లో కాదు చేతల్లో కాస్తయినా మూగజీవుల సేవ చేద్దాం. ప్రకృతిని కాపాడదాం.

అడవిజంతుజాతికావాసమేలేక
అంతరించుపోవుటాగవలయు
వనమురక్షసేయ వసుధయంతయుకూడ
మనకుమేలుసేయు మనుజులార!

స్వార్థబుధ్ధినొదిలి సహజమౌరీతిగ
వర్తనంబుసేయ భావ్యమగును
భూమియంతనీకు భుక్తంబుకాదోయి
వన్యజీవులుండు వసుధకూడ

ప్రకృతియంత కూడ పరమాత్మ రూపమ్ము
ఈశ్వరుండుమనకు నిచ్చివాడు
భావితరమువరకు భధ్రంబుసేయగ
బాధ్యతన్నదనుచు మరువవద్దు

జంతుజాలమన్నజాలిలేకనరులు
వాటివనురులంత వ్యర్థ పరిచి 
నిలువనీడలేక నేడ్చుచుండునటుల
చేయుచుండమేలె చెనుటులార!
(రచన : విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత