నాలోని భావాలు
నాలోని భావాలు నవ్యమౌ రాగాలు
నవనవోన్మేషమౌ నర్తనాలు
అందాలు చిందేటి యాత్మీయ గీతాలు
విరులెల్ల మదిలోన విరిసినట్లు
చిత్రాలు శిల్పాలు చిందించు స్వగతాలు
గతజన్మ.మర్మాలు గరపినట్లు
చిరునవ్వు చిందించు చిన్నారి వూవులు
మనకేమి వివరించు మాటలట్లు
గగనాన తారకల్ గళమెత్తి యేమిని
ఊసులు తెల్పగా నూగెనేమొ
తే.గీ.
మేఘ మండలి మనతోడ మేలమాడ
కాంతి కిరణుండు మనకేమొ జ్ఞప్తి చేసె
బాల్య మందలి భావాలు మతికి తెలిసె
(వర్త మానంబు మనతోడ వంతుకొచ్చె)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి