త్యాగరాజు
చంద్రుని చూచి అరవిందం వికసిస్తుంది.ఇది కవిసమయం."చందురూ వర్ణున్ని హృదయారవిందాన చూచి బ్రహ్మానందం అనుభవించే వారెందరో మహానుభావులు అందరికీ వందనముల"ని అన్నారు త్యాగరాజు. రాముడు నీలమేఘశ్యాముడుకదా! చందురువర్ణుని అని వర్ణించాడేమిటిఅనిపిస్తుందికదూ! నీలి వర్ణము నేత్రద్వయము వరకే .అసలు ఆ పరతత్త్వం శుధ్ధ తత్త్వం వెన్నెల వంటిది.కేవలం ఆనందానుభవైక వేద్యం ,హృదయార విందానహృషీకేశుడైన పరబ్రహ్మను దర్శించిన వారిది బ్రహ్మానందాను భవమే కదా!ఆ హృదయార విందము ముకుళించినది కాదు.పరిపూర్ణంగా వికసించిన హృదయార విందం. పర బ్రహ్మం కేవలం అపరోక్షాను భూతి మాత్రం.మాటలతో మనసుతో వర్ణించలేము
. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా
ఆనందఓబ్రహ్మణఓ వ్యజానాత్ "అన్నది నిగమశిఖ.
మానసవనచరవరసంచారము నిలిపి(నెరపి) మూర్తి బాగుగపొడగనే వారెందరో మహాను భావులు.
మనసుఅతి చంచలమైనది. అందుకే మనసును కోతితో పోలుస్తారు.
""చపలం మమహృదయకపిం విషయద్రుచరం దృఢంబధాన విభో""
అని ఆది శంకరులు తన సువర్ణమాలికా స్తోత్రంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు.
విషయాలపై సంచారించే నా మనస్సనే గొప్పకోతి నిబంధించమని ఆదిశంకరుల అభ్యర్థన.
మనస్సంచారమునునిలిపి భగవతునిపైమనస్సును లగ్నంచేసి ఆపరాత్పరుని దర్శించిన వారెందరో మహాను భావులు కదా!.
అర్జునికి కూడా మనస్సుపై ఇటువంటి సందేహం వచ్చింది.
""చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవధృఢం" అని భగవంతుని ప్రార్థిస్తే
అందుకు శ్రీకృష్ణుడు"
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్య
ణచే గృహ్యతే.
అంటే నిరంతర సాధన వైరాగ్యము వున్న వారే మనస్సంచారమును ఆపి తమ అంతర్దృష్టిని భగవంతుని పై పెట్టగలరు..
మానసవనచరవరుని సంచారమును నిలప గలిగినపుడే భగవంతుని రూపము మనసులో నిలుస్తుంది.మనో నేత్రంతో భగవద్ దర్శనం చేసుకున్న వారు మహనీయులు
"సంగీత మపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం
ఏకమాపాత మధురం అన్యధా√లోచనామృతం "అన్నారు పెద్దలు. త్యాగరాజు కీర్తన సంగీత జ్ఞానములేని పామరులను సహితం ఆనందామృతంలో లీనం చేస్తుంది.
ఇక సాహిత్య పరంగా ప్రతి పదాన్ని మననంచేసిన కొద్ది ఆనందంలో లీనం చేస్తుంది..
అందుకే త్యాగరాజ కీర్తనలను త్యాగోపనిషత్తు అనవచ్చు.
బాల్యంలో త్యాగరాజు మాతృమూర్తి రామదాసుకీర్తనలను పురందరదాసు పదాలను వినిపించేదట!
త్యాగరాజు నిత్యమూ బమ్మెర పోతన విరచిత శ్రీ మదాంధ్రమహాభాగవతమును పారాయణ చేసేవాడట!
{{ ఇంతకు నా సంగీతంలో ఏమాత్రము పరిచయములేదు. కాని త్యాగరాజు సాహిత్యమంటే అమితమైన యిష్టము.భోజనం బాగుందని చెప్పడానికి పాకశాస్త్ర పాండిత్యం అక్కర లేదుకదా!]

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి