నవ్వుల దినోత్సవం

నవ్వు లున్న యిల్లు నందనవనమైన
పారిజాత తరువు ప్రక్క నుండు
ఔషధంబుతోడయవసరముండదు
సంతసమ్మెమనకు సగము బలము

నవ్వ బోకు నీవు నవ్వునష్టపరుచు
నాల్గురీతులన్న నమ్మ బోకు
కష్టకాలమందు  కడుపుబ్బు హాస్యమే
సేదదీర్చు నోయి శ్రేయ మొసగు

సంతసాన పుట్టి సంతసాన బ్రతికి
నవ్వుతోడ గిట్టు నరుని బ్రతుకె
సార్థకమ్ముకాదె జగతిలో నెప్పుడు
ఏడ్పుగొట్టుతనము యేలమనకు

నవ్వు వొకటె మనకు దివ్యమైన వరము
దేవుడిచ్చిన నాడు నీకు నాకు
హస్యరసమ గ్రోలి హాయిగా బ్రతుకొచ్చు
వంద వత్సరాలు వరుసగాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత