సూక్తి సుధ
*సూక్తి సుధ*
క్షతే ప్రహారాణి పతంత్యభీక్ష్ణం
ధనక్షయే వర్ధతి జాఠరాగ్నిః
ఆపత్సు వైరాణి సముద్భవంతి
ఛిద్రేష్వనర్థా బహుళీ భవంతి
దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. డబ్బు లేనప్పుడే ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆపదలో సమయంలోనే విరోధాలు కలుగుతాయి. క్లిష్ట పరిస్థితులలోనే చిక్కులు ఎక్కువవుతాయి.
దెబ్బపైని దెబ్బ ద్విగుణీకృతంబౌను
అర్థహీనమపుడెనాకలగును
గొడవలెక్కువగును గొప్పకష్టములందు
చిక్కులెక్కవగును చితికినపుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి