అన్నపూర్ణమ్మ

అన్నమయములైన యఖిలజీవులకెల్ల
అన్నమొసుగుతల్లి యున్న పూర్ణ
పాంచభౌతికమైన ప్రాణులెపుడునిన్ను
అమ్మయనుచుతాముపిలుతురెపుడు
కాశికానగరాన కొలువున్న తల్లివి
విశ్వేశు పత్నగావినుతికెక్కి
భవునికేనీవంత  భవ్యమౌ రీతిగా
భిక్షమిడెడుతల్లి ప్రీతితో డే
పెద్దకనులతల్లి ప్రియముతోమమ్మంత
ఆదరించునుకాదె నార్తిబాపి
మాత యనచుతలతు పార్వతీమాతగా
జ్ఞాన భిక్ష నొసగి కావుమమ్మ
మూడు కనుల తండ్రి మురిపంబుచూపుచు
ఏలవలయుమమ్ము యెపుడుకూడ
(రచన:-విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత