మహిషాసుర మర్దిని
మహిషాసురునిచంపి మహినికాచినయట్టి
మమతాను రాగాల మంచి తల్లి
కరువు రక్కసిచిక్కి క్రక్కదలిజనులు
అలమటించిరకట నాకలొదవ
శాకంబరీమాత సర్వజీవులకెల్ల
ఆహర మందించు యన్న పూర్ణ
దుర్గమువధియించి దుర్గమ్మవై వచ్చి
విచ్చేసె తానంత విజయవాడ
ఆ.వే.భక్త జనుల కెల్ల భద్రంబు నొసగేటి
మామంచి తల్లియే మాకు దిక్కు
శరణు కోరి వచ్చి శరణన్న వారికి
అంబ కన్న దిక్కు యన్యులెవరు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి