త్యజనీయత
ధనములేని నరునిత్యజియించు వేశ్యయు
ప్రజలమెప్పులేని ప్రభువునైన
తిండితిన్నవెన్కతెరువరైననుకూడ
ఫలములేనితరువుపక్షులట్లు
వదిలివేయుటంతవసుధలోసహజమ్ము
ఇదియెలోకరీతియిలనుజరుగు
ఉన్నవాని వెన్కనున్నచోకొంతైన
మనకుదక్కుననుచుమదినియాశ
మూల శ్లోకం:----
నిర్ధనంశపురుషం వేశ్యా
ప్రజాభగ్నం నృపం త్యజేత్
ఖగావీతఫలవృక్షం
భుక్త్వాచాభాగ్యతో గృహం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి