అర్ధాంగి
ఆత్మాభిమానమ్మ నధికమౌ నర్ధాంగి
మానినీరత్నమ్ము మాటపడదు
పెట్టుగుణమలోన పెద్దచేయితనది
మనసంతనిండినమంచితనము
అందరిమంచినీయాపేక్షుపడునట్టి
సదయహృదయురాలుశాంతమూర్తి
గుండెకోతైననుగుట్టుగాభరియించి
తనలోనదాచిన తత్త్వవేత్త
మగనిపైమమతానుబంధమ్ముమనసార
చేతలందునుచూపెడిచెలియతాను
ఆకాశహర్మ్యాలయాలోచనేలేని
అతివలందున నధ్భుతమ్ము
స్వల్పమయినచాలుసంతృప్తిపొందెడు
వ్యక్తిత్వమున్నట్టివనితతాను
నేస్తాలతోమైత్రినిత్యంబుసాగించి
ఆత్మీయబంధాన్ని యల్లుకొనును
కొత్తపాతలనకకొసరితినిపంచు
మమతానరాగాలమాతృమూర్తి
ఆప్తమిత్రురాలునర్ధాంగికన్నను
సప్తపదులమైత్రి సాగుననుచు
పెద్దలెల్లమాకు ప్రేమతోదీవనల్
ఇచ్చినారువారుయింపుమీర
(రచన:--విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి