శ్రీ వేంకటేశ్వర సుప్రభాతకవి

అమృతోపమానమ్మయానంతచార్యల
సుప్రభాతరచనసుందరమ్ము
చెవులుపెట్టినధాత చేష్టితాన్నిపొగడ
యోగ్యతేమికలదుయిలనుమనకు
సుమధరధారగా సుధనుకురియజేయు
అమ్మపాలనుబోలు నమృతమంత
ఆనందనిలయునియనురాగమంతయు
మాకునొసగినావు మమతతోడ
ఆపాతమధురమ్మునాలికించినచాలు
బ్రహ్మానుభూతియే మాకుకలుగు
ఆ.వె‌ సూరి జనుడవీవు సుందరమూర్తిని
కన్నులారా నీవు కాంచినావొ
లేకయున్నయిట్లు లేవడెవరురాయి
నీకు నీవె సాటి నిజముగాను
(రచన;--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత