వీరసైనికుని చివరి సందేశం

(వీర సైనికుని చివరి సందేశం)
సాగనంపుడునన్ను సదనమ్ము వరకును
రణరంగ భూమిలో రాలగానె
పతకమ్ము లన్నియు పదలిమౌరీతిగా
కాయమ్ము పైనింక కప్ప వలయు
అమ్మతో చెప్పండి యధ్భుతంభౌరీతి
సమరాన సమరంబు సల్పినట్లు
తల్లడిల్లవలదనుచు తండ్రికి తెల్పండి
చింతింప వలదంచు చివరి పలుకు
అలసి సొలసి నాను నాదమరిచి నిద్ర
చెందితంచు తెలుపు చెల్లికింక
జనని గర్భమందు జన్మించి నేనంత
ఋణము తీర్చు కొందు రుజువుగాను
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి
(ఒకసైనికుని లేఖ చదివి ప్రేరణతో రాశాను)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత