దోషము గుణమగుట
సుభాషితం -
----------------
దోషోsపి గుణతాం యాతి
ప్రభోsర్భవతి చేత్కృపా ౹
అంగహినోsపి సూర్యేణ
సారథ్యేయోజితోsరుణః ౹౹
ప్రభువు కృప ఉన్నచో దోషము కూడా గుణమే అవుతుంది.సూర్యుడు అంగవిహీనుడైన అరుణుడిని సారథిగా నియమించుకున్నాడు కదా అలా...!!
తప్పులైననేమియొప్పులగునుగాదె
ప్రభువుతలచుకొన్న ఫలముదక్కు
ఊరురహితుడైననుదయభానుదయతో
స్యందనమ్మునడుపుసారథాయె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి