సూక్తిసుధలు

విశ్వమయుడువిభుడువిష్ణుండు జిష్ణుండు
భక్తవరుదుడతడు భధ్రమొసగు
అందరందుతాను నాత్మయై యుండును
సుమములందునుండు సూత్రమట్లు

వాన కారు రాగ వహియించు మౌనము
కూహుకూహుయనదు కోయిలమ్ము
భేకరాజు వచన భీకరుండైనను
కూయ వెరచు కాదె కోయిలమ్మ

కులము పేరు తోడ కుమ్మక్కు కొందరు
మతము పేరుతోడ మంతనాలు
అండలేక జనత అధ్వాన్న మగుగాని
ఎండ మావికన్న ఎట్లుమెరుగు

నిన్నునీవుయెరుగనిపుణత్వకళయున్న
జ్ఞానివగదువోయి ఖచ్చితంగ
తనునుతానుతెలియ తత్త్వవేత్తయగుట
తపముకాదెమనకు ధరణిలోన
(రచన--విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత