తొలిపూజదేవర
తోలిపూజలందేటితొండపుదేవర
కవులలోకెల్లను కవివినీవు
జేష్ట్యుడౌదేవుడై శ్రేష్టమౌరీతిగ
మమ్మేలవచ్చేవు మమ్భు బ్రోవ
ప్రణవస్వరూపివై పర బ్రహ్మ తత్త్వమై
పార్వతీపుత్రుడై పరగినావు
విఘ్నాలుకలిగింప విఘ్నాలు తొలగింప
కామ్యాలుతీర్చెటి కర్తవీవు
హాస్యరసమనకునధిదేవుడైనావు
గుంజిల్లు తీయించు గురువునీవు
మోదకహస్తుడై మోదంబుకూర్చగ
తరలివచ్చితివయ్య తండ్రివోలె
కోరిన విద్యలు కొలచినవారికి
అఁందజేయుదువట యాదరాన
చింతలెల్లదీర్చుచింతామణివినీవు
పత్రపూజయన్న పరవశమ్ము
గరికపూజయన్న ఘనమైన పూజగా
స్వీకరించవయ్య చిద్విలాస!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి